calender_icon.png 20 April, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిటీ హాల్‌ను అభివృద్ధి చేయాలి

16-04-2025 12:14:50 AM

ఎంపీ ఈటలను కలిసిన కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా 

ఎల్బీనగర్, ఏప్రిల్ 15 : దిల్‌సుఖ్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ ను అభివృద్ధి చేయాలని స్థానికులు కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తాతో కలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు వినతి పత్రం అందజేశారు. న్యూ దిల్‌సుఖ్ నగర్ కాలనీవాసులు తమ కాలనీలో వివిధ సమస్యలతో పాటు కమ్యూనిటీ హాల్ అభివృద్ధి విషయంలో స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తాను కలిశారు.

నిధులు మంజూరు చేయాలని మంగ ళవారం ఎంపీ ఈటల రాజేందర్ ని కలిసి ప్రతిపాదనలను అందజేశారు. ఎంపీని కలిసినవారిలో న్యూ దిల్ సుఖ్ నగర్ కాలనీ అధ్యక్షుడు రాజేశ్వర్ రావు, సెక్రటరి పద్మిని, ట్రెజరర్ సుషిమిత, గోవింద్ రాజు, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నవీన్ యాదవ్, వినోద్ యాదవ్ తదితరులు ఉన్నారు.