calender_icon.png 13 November, 2024 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిటీ హా(స్కూ)ల్స్

11-11-2024 12:03:20 AM

  1. ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు కరువు
  2. కమ్యూనిటీ హాళ్లలో తరగతుల నిర్వహణ
  3. ఒక్కోగదిలో 100మందికి పాఠాలు
  4. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి) : మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవు, సరైన వసతులు లేవు అనే వార్తలు మనం నిత్యం ఎక్కడో చోట వినడం, చదవడం వంటివి చూస్తూనే ఉంటాం.

అయితే రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లోనూ ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ పాఠశా లలకు సొంత భవనాలు, ఉన్న పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడతున్నారు. దీనికి తోడు నగరంలోని పలు కమ్యూనిటీ హాళ్లు, వివిధ శాఖల కు చెందిన భవనాల్లో  ప్రభుత్వ ప్రైమరీ, హైస్కూళ్లు నడుస్తున్నాయి.

పాఠశాలల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ప్పటికీ పరిస్థితి క్షేత్రస్థాయిలో వేరే లెవల్లో ఉందని ప్రజలు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన  అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను అన్నీ తానై నడిపించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ సైతం ఈ పాఠ శాలల విషయంలో నిస్సహాయంగా ఉండిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకేచోట 100 మందికి పాఠాలు..

కమ్యూనిటీ హాళ్లు, ఇతర శాఖల భవనాల్లో నడుస్తున్న పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు చేపట్టి కొంత మేరకు వసతులు కల్పించినప్పటికీ స్థానికులతో నిత్యం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులున్నట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. పలు కాలనీల్లో కొంతమంది కావాలనే పాఠశాలల ఆవరణలను నిత్యం అపరి శుభ్రం చేసు న్నారని ఆరోపిస్తున్నారు.

దీనికి తోడు కమ్యూనిటీ హాళ్లు, ఇతర శాఖల భవనాల్లో నడుస్తున్న పాఠశాలల్లో ఒకటి, రెండు గదుల్లోనే 100 మందికి పైగా విద్యార్థులు కూర్చోవడంతో పాటు ఒకేచోట ఐదు తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితులున్నాయి.  దీంతో పాఠాలు చెప్పే క్రమం లో ఉపాధ్యాయులకు, విద్యార్థుల గ్రహణ శక్తికి ఇబ్బందులు కలుగుతోంది. అంతమంది విద్యార్థులకు ఒకటి, రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉండటం గమనార్హం.

పలుచోట్ల అవి కూడా కరువే అని తెలుస్తోంది. ఆయా పాఠశాలలకు సొం త భవనాలను నిర్మిస్తే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తొలగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తరగతి గదులు, వసతులు సరిగా లేకపోవడంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని.. పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని పలువురు చెబుతున్నారు.

సొంతభవనాలు కరువు..

హైదరబాద్ జిల్లాలో మొత్తం 691 ప్రభు త్వ పాఠశాలలున్నాయి. వాటిలో కేవలం 400 వరకు పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మిగిలిన పాఠశాలలను అద్దె భవనాలు, వివిధ శాఖలకు సంబంధించిన కమ్యూనిటీ భవనాల్లో నిర్వహిస్తున్నారు. ప్రభు త్వం ఎటువంటి కిరాయి కట్టకుండా వివిధ శాఖల భవనాల్లో కొనసాగుతున్న స్కూళ్లే హైదరాబాద్‌లో దాదాపు 50కి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి బహదూర్‌పు, అంబర్‌పేట, సైదాబాద్, నాంపల్లి మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. 

మేయర్ డివిజన్‌లోనూ..

సాక్షాత్తూ హైదరాబాద్ మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారాహిల్స్ డివిజన్ లోని ఉదయ్‌నగర్ కాలనీలోనూ ఒక పాఠశాల కమ్యూనిటీ హాల్‌లోనే నడుస్తోంది. స్థా నిక  పోచమ్మ గుడి ఆవరణలోని కమ్యూనిటీ హాల్‌లో నడుస్తున్న ఈ ప్రైమరీ స్కూల్‌లో దాదాపు 150 మందికి పైగా విద్యార్థులున్నారు. స్థానిక బస్తీ కమ్యూనిటీ హాల్‌లో ఈ పాఠశాల నడుస్తోంది.

దీంతో పలువరు ఆకతాయిలు కావాలనే పాఠశాల ఆవరణను అపరిశుభ్రం చేస్తుంటారని విద్యార్థులు వాపోతున్నారు. దీనికి తోడు కమ్యూనిటీ హాల్ పైనే స్థానికులు తమ స్టోర్ సామగ్రిని ఉంచడంతో వర్షాకాలంలో నీళ్లు నిలిచి స్లాబ్ ఉరుస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

2018లో నాటి కలెక్టర్ యోగితారాణి, సొసైటీ ఫర్ పార్టిసిపేటరీ డెవలప్‌మెంట్ అనే సంస్థ నిర్వాహకురాలు డా.జస్విన్ జైరత్ కృషితో ఏర్పడ్డ ఈ పాఠశాలను.. కమ్యూనిటీ హాల్ నుంచి ఖాళీ చేయించేందుకు పలువురు కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపణలున్నాయి.

బస్తీలోని కడు పేదరికంలో ఉన్న పిల్లలు చదువుకునే ఈ పాఠశాలలో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు చెత్తవేసి తగులబెట్టడం, అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో భాగంగా బిగించిన నల్లాలను అపహరించారు. కమ్యూనిటీ హాళ్లలో కొనసాగుతున్న అన్ని పాఠశాలల్లో పరిస్థితులు దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని విమర్శలు ఉన్నాయి.

ఉన్నతాధికారులు స్పందంచి పాఠశాలలకు శాశ్వత పక్కా భవనాలు నిర్మించడంతో పా టు మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. 

అపరిశుభ్రం చేస్తున్నారు

మేము స్కూల్‌కు వచ్చే సమయానికే కాలనీలోని పెంపుడు కుక్కలు, వీధికుక్కలు పాఠశాల ఆవరణలో అపరిశుభ్రతను సృష్టిస్తున్నాయి. కమ్యూనిటీహాల్ బావి నుంచి మా పాఠశాలకు నీటిని వాడుకుంటున్నాం. దాంట్లోనూ కొంతమంది చెత్త, ఇతర వస్తువులను వేస్తున్నారు. నల్లాలు విరగ్గొడుతున్నారు.

 జయశ్రీ, ఐదోతరగతి, ఉదయనగర్ ప్రైమరీ స్కూల్