calender_icon.png 29 April, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నిర్మూలన కే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

26-04-2025 12:29:29 AM

వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వర రావు

వనపర్తి టౌన్ ఏప్రిల్  25: నేరాల నిర్మూలన,శాంతి భద్రతల  పరిరక్షణ  కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్  ప్రోగ్రాం తనిఖీలు చేస్తున్నామని వనపర్తి డిఎస్పీ అన్నారు.శుక్రవారం రోజు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు వనపర్తి డిఎస్పీ,వెంకటేశ్వర రావు, వనపర్తి సీఐ,ఎం. క్రిష్ణయ్య  ఆధ్వర్యంలో  సీఐలు -01 ఎస్త్స్రలు -11 మంది మొత్తం 70 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి వనపర్తి పట్టణ పోలీస్టేషన్ పరిధిలోని పీర్లగుట్ట డబుల్ బెడ్ రూమ్స్ దగ్గర  పోలీసులు ఆకస్మికంగా  కమ్యూనిటీ కాంటాక్ట్ తనిఖీలు నిర్వహించి సుమారు 100 ఇళ్లను సోదాలు చేశారు.

పత్రాలు సరిగా లేని మరియు నెంబర్ ప్లేట్ లేని ద్విచక్రవాహనాలు మొత్తం 24 వాహనాలు అదుపులోకి తీసుకొని సీజ్ చేసి వనపర్తి పట్టణ పోలీస్టేషన్ కు తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా డిఎస్పీ  మాట్లాడుతూ..  నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని  ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ, రాందాస్ తేజావత్, వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వర్ రావు, వనపర్తి సిఐ, ఎం,కృష్ణయ్య, వనపర్తి పట్టణ ఎస్త్స్ర, హరిప్రసాద్  వనపర్తి రూరల్ ఎస్త్స్ర, జలేందర్ రెడ్డి, అన్ని  పోలీస్టేషన్ల ఎస్త్స్రలు, ఏఎస్త్స్రలు, హెడ్ కానిస్టేబుల్, మరియు కానిస్టేబుల్స్, మహిళ కానిస్టేబుళ్లు. హోంగారడ్స్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.