25-02-2025 04:07:24 PM
బైంసా,(విజయక్రాంతి): పట్టణ ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. పట్టణంలోని ఓవైసీ నగర్లో మంగళవారం సీఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న105 మోటార్ సైకిల్ నాలుగు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలను కలిగి ఉండరాదని, నడపవద్దని ఏ ఎస్ పి అన్నారు. కొత్త వ్యక్తులను గమనిస్తూ ఉండాలన్నారు. సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్ దొంగతనాల నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా అనుమానాలు ఉంటే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు పోలీసులు స్థానికులు పాల్గొన్నారు.