calender_icon.png 30 September, 2024 | 1:58 PM

నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

30-09-2024 12:02:26 PM

-వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

రాజన్న సిరిసిల్ల:  నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఈ రోజు కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామంలో సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్స్ లేని 21 ద్విచక్ర వాహనాలు ,01 ఆటో స్వాధీనం చేసుకున్నారు. వాహన దారులకు సరైన పత్రలు చూపించి వాహనాలు తీస కెల్లాలని ఏఎస్పీ  తెలిపారు.అనంతరం ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మట్లాడుతూ.. ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం, ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.

పట్టణ,గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని,  గ్రామాల్లో ఎవరైనా  అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసులకు,లేదా డయల్ 100 కాల్ కు చేసి సమాచారం అందించాలని వెంటనే చర్యలు చేపడతాం అన్నారు. గ్రామాల్లో యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో గంజాయి,గుడుంబా తయారీకి సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్ వారికి అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాలల్లో,నేరాల నియంత్రణ లో  సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సి.ఐ వెంజటేశ్వర్లు, ఎస్.ఐ లు కిరణ్ కుమార్, అశోక్ ,పోలీస్ సిబ్బంది , డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.