calender_icon.png 24 February, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశు మందిరాలతో సమాజ నిర్మాణం

24-02-2025 12:59:47 AM

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 

ఘనంగా శ్రీ శారదా ధామము  41 వ వార్షికోత్సవం

 రాజేంద్రనగర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి: శిశు మందిరాల ద్వారా మంచి సమాజ నిర్మాణం జరుగుతోందని రాష్ర్ట గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ శారదా ధామము 41 వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ శారదా ధామములోకి ప్రవేశించిన వెంటనే తాను ఒక చక్కటి అనుభూతికి లోను అయినట్లు తెలిపారు. చదువుల తల్లి శారదా మాత దర్శనం, చక్కటి వాతావరణం ఎంతో ఆకట్టుకుందన్నారు.

దేశానికి, సమాజానికి అవసరమైన భవిష్యత్ యువతరం శ్రీ సరస్వతీ శిశు మందిరాల ద్వారానే నిర్మాణము అవుతుందన్నారు. ఇక్కడే చక్కని పునాది పడుతోందాన్నారు. చక్కటి కుటుంబ వ్యవస్థ, సంస్కృతి సంప్రదాయం తో కూడిన విద్య శిశుమందిరాలలో దొరుకుతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమములో శ్రీ సరస్వతీ విద్యా పీఠం తెలంగాణ అధ్యక్షులు, విశ్రాంత ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డాక్టర్ తక్కెళ్లపల్లి తిరుపతి రావు, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి విరివింటి రవీంద్ర శర్మ, ఆవాస విద్యాలయం కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్, అధ్యక్షులు అర్జున్ గౌడ్, శ్రీ సరస్వతీ విద్యా పీఠం ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. బాల బాలికల ఘోష్ ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది.