సీపీఐ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌రావు
మహబూబాబాద్, నవంబరు 17: ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని, నవసమాజ నిర్మాణానికి మార్క్సిజం దిక్సూచి అని సీపీఐ రాష్ట్ర నాయకుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. హను మకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా సమితి ఆధ్వర్యం లో నిరంతర రాజకీయ పాఠశాలను శ్రీనివాసరా వు ప్రారంభించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడు తూ.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజల మధ్య ఉండి ప్రజల ను చైతన్యం చేస్తూ ప్రశ్నించే గొంతు గా సీపీఐ పనిచేస్తున్నదన్నారు. శత వసంతాలు కలిగిన చరిత్ర సీపీఐ ఎన్నో పోరాటాలు చేసి ప్రజాపక్షంగా నిలిచిందన్నారు.సమావేశంలో ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, స్టాలిన్, తోట భిక్షపతి, ఎల్లేష్, కర్రె లక్ష్మణ్, భిక్షపతి, చంద్రమౌళి పాల్గొన్నారు.