calender_icon.png 13 November, 2024 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజేయమైనది కమ్యూనిజం

10-11-2024 05:47:59 PM

సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు గన్నా చంద్రశేఖర్

ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హుజూర్నగర్ లో భారీ ర్యాలీ

హుజూర్ నగర్ (విజయక్రాంతి): ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గాంధీపార్కు సెంటర్ నుండి సిపిఐ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీతో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో అజేయమైనదని కమ్యూనిజమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. పేద ప్రజలకు అండగా ఎర్రజెండా నిలిచిందని, అనేక పోరాటాల ద్వారా బడుగు, బలహీనవర్గాల హక్కుల సాధనకై, పేదప్రజల సమస్యల పరిష్కారానికై వారి వెంట నిలిచిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అన్నారు. సిపిఐ వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో సిపిఐ పార్టీ కనబరిచిన తీరు గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది పార్టీ నాయకులు పాల్గొని అమరులైనారన్నారు. అమరవీరుల పోరాట స్ఫూర్తితో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రమ దోపిడికి వ్యతిరేకంగా తన, మన స్వార్ధం లేని నూతన సమాజం నిర్మించడమే లక్ష్యంగా వందేళ్ల నాడు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని పేదప్రజల సమస్యలే అజెండాగా ముందుకు సాగుతున్నామని భారతదేశంలో జరిగిన అన్ని ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న సిపిఐ పార్టీ అని ఆయన సగర్వంగా ప్రకటించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, ఎం.వెంకటేశ్వర్లు, ఉత్తేల నారాయణరెడ్డి, దేవరం మల్లీశ్వరీ, ధూళిపాళ ధనుంజనాయుడు, గుండు వెంకటేశ్వర్లు, జడ శ్రీనివాస్, దొంతగాని సత్యనారాయణ, జడ వెంకన్న, సోమగాని కృష్ణ, ఇందిరాల వెంకటేశ్వర్లు, సుందరి పద్మ, జక్కుల రమేష్, ఎల్లావుల రమేష్, మామిడి వెంకయ్య, జక్కుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.