calender_icon.png 11 January, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతతత్వ బీజేపీతో ప్రజాసామ్యానికి ముప్పు

31-12-2024 03:03:11 AM

* సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా

* నల్లగొండలో సీపీఐ భారీ బహిరంగ సభ

* హాజరైన కమ్యూనిస్టు జాతీయ నేతలు 

నల్లగొండ, డిసెంబర్ 30 (విజయక్రాంతి): మతతత్వ బీజేపీ ప్రజాస్వామ్యానికి పెనుముప్పని, దేశం నుంచి దానిని పారద్రోలేందుకు ప్రజాస్వామ్య, లౌకిక, వామపక్ష శక్తులన్నీ ఐక్యంగా పోరాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని నినదించిన ఏకైక పార్టీ సీపీఐ అని గుర్తు చేశారు. వందేళ్ల చరిత్ర ఉందని చెప్పుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్య్ర పోరాటంలో ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ గురువు ఆర్‌ఎస్‌ఎస్ అని, దాని రాజకీయ విభాగమే బీజేపీ అని పేర్కొన్నారు.

భారత్ హిందూదేశంగా మారితే దేశ ప్రజలకు పెను ముప్పు తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగానికి, దేశానికి, ప్రజాస్వామ్యానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో పెను  ప్రమాదం పొంచి ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను పదే పదే అవమానిస్తే దేశంలో తిరిగే పరిస్థితి ఉండదని, ప్రజలే తిరగబడతారన్నారు. 

పేదవాడి చూపు కమ్యూనిస్టుల వైపే

పేద వాడికి కష్టం వస్తే చూసేది కమ్యూనిస్టు పార్టీల వైపేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పూటకో మాట.. రోజుకో పార్టీ మార్చే నేతలకు కమ్యూనిస్టు నేతలను విమర్శించే అర్హత లేదన్నారు.

భవిష్యత్ కమ్యూనిస్టులదేనని, ఎర్రజెండాలన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. సోషలిస్టు సమాజమే కమ్యూనిస్టుల ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు సీపీఐ శ్రేణులు క్లాక్ టవర్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ సభ మైదానానికి చేరుకున్నారు. పార్టీ సీనియర్ నేతలను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా, పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెళ్ల శ్రీనివాస్, ఈటీ నరసింహ, బోసు, బాల నరసింహ, భదాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంతోపాటు పలు జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. 

సామాజిక న్యాయం కోసం పోరాటం

* సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య

సంగారెడ్డి, డిసెంబర్ 30 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని, ప్రజా సమస్యలపై సీపీఎం పోరాటం చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య తెలిపారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో ప్రజలకు ఎర్ర జెండా పార్టీ అవసరం ఏర్పాడిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌లకు అప్పగిస్తే కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. జనవరి 25న సంగారెడ్డిలో సీపీఎం రాష్ట్ర నాలుగోవ మహాసభలు ప్రారంభిస్తామని తెలిపారు.

మహా సభలకు వెయ్యి మంది ముఖ్యనేతలు హరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్క రాములు, సంగారెడ్డి సీపీఎం కార్యదర్శి జైయరాజ్, నాయకులు మల్లిఖర్జున్,  అడివయ్య. నర్సింహులు, మణిక్యం తదితరులు పాల్గొన్నారు.