నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా రక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని పిడిఎస్యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ లో వారు మాట్లాడారు. నర్సాపూర్ జి. ఉన్నత పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు తాత్కాలికమైన అని అటువంటి ఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ చెరువచూపాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని సస్పెక్ట్ చేసినంత మాత్రాన విద్యార్థులకు ఒరిగింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. బాధ్యత గల ఉపాధ్యాయులు ఈ విధంగా వివరించడం వల్ల విద్యాశాఖకు చెడ్డ పేరు వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్, చందు, దాదేరావు తదితరులు ఉన్నారు.