డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ప్రభుత్వం నిర్వహించనున్న సెమీ క్రిస్మస్ వేడుకల కోసం రాష్ట్రస్థాయితోపాటు ప్రతి నియోజకవర్గస్థాయి లో కమిటీలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా కమిటీలను పూర్తి చేయాలన్నారు. బుధవారం వేడుకల నిర్వహణ, కమిటీ ఏర్పాటుపై సచివాలయంలోని అధికారులతో సమీక్షించారు.
కమిటీల ఏర్పాటు తర్వాత వేడుకలను నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్‌తో రావాలని చెప్పారు. సమావేశంలో మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ తాఫ్సీద్, ఇక్బాల్, మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ యాస్మిన్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఎండీ సబిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.