హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాం తి): వచ్చే విద్యాసంవత్సరం 2025-26లో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర సెట్స్ ద్వారా ఉన్నత విద్యా కోర్సుల్లోని ప్రవేశాలకు స్థానికత నిర్ధారణకు ప్రభుత్వం నియమించిన నలుగురు అధికారుల కమిటీ ఈ అంశాన్ని ఇంకా ఎటూ తేల్చలేదు. రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు కావడంతో ప్రవేశాల్లో కొత్త గా స్థానికతను నిర్ధారించాల్సి ఉంది.
ఈ కమి టీ ఇంతవరకు ఏదీ తేల్చలేదు. రాష్ర్ట విభజన సమయంలో విద్యావకాశాల నిబంధనలను 10 ఏండ్లపాటు సడలించారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేండ్లు రాష్ర్టం లో చదివితే స్థానికులుగా పరిగణించారు. స్థానికత తేలితేనే ఎప్‌సెట్, ఇతర సెట్స్ నోటిఫికేషన్, షెడ్యూల్స్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది.
ఇంత వరకూ దీనిపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో సెట్స్ షెడ్యూల్‌కు కాస్త సమయం పట్టే అవకాశముంది. నాన్ లోక్ అభ్యర్థులను అన్‌రిజర్వ్‌డ్ కోటా కింద పరిగణించాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ఇప్పటికే ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీలో చైర్మన్‌గా ఉన్నత విద్యామం డలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కన్వీనర్‌గా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, మెంబర్లుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఉన్న విషయం తెలిసిందే.