న్యూఢిల్లీ, అక్టోబర్ 16: జీఎస్టీలో పరిహారపు సెస్‌ను విలీనం చేసే అంశంపై మంత్రుల కమిటీ చర్చించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి బుధవారం తెలిపారు. జీఎస్టీ కాంపన్సేషన్ సెస్‌పై 10 మంది మంత్రులతో కూడిన ప్యానల్ తాజాగా చర్చిందన్నారు. జీఎస్టీపై వేసే సెస్ ద్వారా ఒనగూడిన ఆదాయాన్ని జీఎస్టీ అమలుతో నష్టపోయే రాష్ట్రాలకు పరిహారంగా పంపిణీ చేస్తారు.
ఈ పరిహారాన్ని ఐదేండ్లకు మాత్రమే చెల్లించాలని తొలుత నిర్ణయించారు. అందుకు రాష్ట్రాలు కూడా అంగీకరించాయి. ఐదేండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత పరిహారపు సెస్‌ను జీఎస్టీలో కలపనున్నట్టు 2022 డిసెంబర్‌లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రకటించారు.
2026 మార్చి నెలతో పరిహారపు సెస్ గడువు ముగియనున్నది. తాజా కమిటీ సమావేశపు వివరాలను చౌదరి వెల్లడిస్తూ బుధవారంనాటి సమావేశంలో ప్రతీ రాష్ట్రం తన అభిప్రాయాన్ని వెల్లడించిందని, మరోసారి నవంబర్‌లో సమావేశం కానున్నట్టు తెలిపారు.