calender_icon.png 28 October, 2024 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రెడిటేషన్ విధానాలపై కమిటీ సమావేశం

27-10-2024 12:00:00 AM

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ మంజూరుకు అవసరమైన విధివిధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ శనివారం బీకే భవన్‌లో సమావేశమైంది. మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ పత్రికలకు చెందిన ఎడిటర్లు కే శ్రీనివాస్, అమీర్ అలీఖాన్, రవికాంత్‌రెడ్డి, సీనియర్ ఫొటో జర్నలిస్ట్ కే నరహరి, సమా చార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ డీఎస్ జగన్ పాల్గొన్నారు.

వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న అక్రెడిటేషన్ కమిటీ నిబంధనలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఇతర మీడియాకు అక్రెడిటేషన్ల అంశాలపై చర్చించారు. రాష్ట్రం లో నూతన మార్గదర్శకాలపై జర్నలిస్టు యూనియ న్లు, అసోసియేషన్లు, ప్రెస్‌కబ్లులు, వ్యక్తుల నుంచి ప్రత్యేక కమిటీ సలహాలు ఆహ్వానించింది.