నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదువంశీ దర్శకుడు. నూతన నటీనటులతో చేస్తున్న ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు.
అందులో భాగంగా పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్ ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నుంచి వైజాగ్ ప్రాంతాలకు వెళ్లి అక్కడ సందడి చేసింది. అందులో భాగంగా తన బాబాయ్ అయిన సినీ నటుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురాన్ని చిత్ర యూనిట్ సందర్శించింది.
అక్కడ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించింది. మరోవైపు సోమవారం హైదరాబాద్‌లో ‘కమిటీ కుర్రోళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కల్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.