పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మనస్థాపనతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... తెలంగాణనగర్ కు చెందిన చాంద్ పాషా వయసు( 45) నవభారత్ ప్లాంట్లో క్యాజువల్ లేబర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఫంక్షన్ కి వెళ్లడం ఎందుకని కూతురు 10వ తరగతి చదువుతున్న నేపథ్యంలో పబ్లిక్ పరీక్షలు దగ్గర ఉన్నాయి ఫంక్షన్ కి వెళ్లడం అవసరం లేదని భర్త భార్యతో అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందిని, ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరి వేసుకొని చనిపోయే ముందు మృతుడి చెల్లెలు షర్మిలాకు వీడియో కాల్ చేసి చనిపోతున్నానని తెలియజేసినట్లు సమాచారం. మృతుడి భార్య స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. వారికి ఇద్దరు పిల్లల ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్ఐ సుమన్ తెలిపారు.