calender_icon.png 22 October, 2024 | 1:11 PM

కమిట్‌మెంట్ అవాస్తవం

19-10-2024 12:00:00 AM

అనన్య నాగళ్ల, యువచంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘పొట్టేల్’. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో చిత్రబృందమంతా పాల్గొంది. ఈ క్రమంలోనే అన న్యా నాగళ్లకు ఓ ప్రశ్న ఎదురైంది. ’తొలుత అవకాశం ఇచ్చేటప్పుడు కమిట్‌మెంట్ అడుగుతారు. వేరే ఇండస్ట్రీలో ఇలా ఉండదు. మీరెప్పుడైనా దానిని ఎదుర్కొన్నారా? అని ఆమెను ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. “మీరు100 శాతం ఫస్ట్ కమిట్‌మెంట్ అడుగుతారు అని ఎలా చెబుతారు? ఇది 100 శాతం అబద్ధం. నేను ఎప్పు డూ అలాంటిది ఎదుర్కోలేదు. అయితే 50 శా తం పాజిటివ్.. 50 శాతం నెగిటివ్ ఉంటుంది. అంతేకానీ ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చే ముందు కమిట్‌మెంట్ అనేది పూర్తిగా అవాస్తవం” అని అనన్య సమాధానం ఇచ్చారు.

కమిట్‌మెంటును బట్టే పారితోషికం ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుందని విలేకరి తిరిగి ప్రశ్నించగా.. “మీరు ఎక్స్‌పీరియన్స్ చేయకుండా విన్న మాటలు చెబుతున్నారు. కానీ నేను ఆ ఫీల్డ్‌లోనే ఉన్నా. అలాంటిదేం ఇండస్ట్రీలో లేదు” అని అనన్య సమాధానం చెప్పారు. పొట్టేల్ చిత్రం అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి నిశాంత్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మాతలుగా వ్యవహరించారు.