24-02-2025 05:17:01 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ శివాలయాల వద్ద పారిశుధ్య కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. ఈనెల 26న మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్ గౌడ్ సానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్ తెలిపారు. పట్టణంలోని ఓంకారేశ్వర ఆలయం బుధరపేట్ లింగేశ్వర ఆలయం నగరేశ్వర వడ నందిగుండం శివాలయం ఇతర ప్రాంతాల్లో పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు.