calender_icon.png 18 November, 2024 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర ఇంటింటి సర్వేను పరిశీలించిన కమిషనర్

09-11-2024 06:06:35 PM

మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వేలో భాగంగా పట్టణంలో చేపట్టిన సర్వేను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. శనివారం పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించి ఎన్యుమరేటర్లు చేపట్టిన సర్వే, కుటుంబ సర్వే పత్రాలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఇంటికి మున్సిపాలిటీ తరపున ఎన్యుమరేటర్లు వచ్చి సర్వే నిర్వహిస్తారన్నారు. పట్టణ ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు,ధరణి పాస్ బుక్కులు వంటి ఇతర దస్తావేజులు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు.

వివరాల సేకరణలో భాగంగా  పత్రాలు అందుబాటులో ఉంటే వేగంగా సమాచారం సేకరణ జరగి సర్వే త్వరగా పూర్తవుతుందన్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్‌ కార్డు,పట్టాదారు పాసు బుక్కులు వంటివి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సర్వే వివరాలు నమోదు అనంతరం తాను చెప్పిన వివరాలన్నీ వాస్తవం అని అంగీకరించి కుటుంబ యజమాని సంతకం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు