calender_icon.png 16 November, 2024 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరితహారం కార్యక్రమ పనులను తనిఖీ చేసి పరిశీలించిన కమీషనర్

16-11-2024 05:00:19 PM

కరీంనగర్ లో పర్యటించిన నగరపాలక సంస్థ కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్

హరితహారం వర్కర్స్ అటెండెన్స్ పరిశీలించి... బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చేందుకు సిబ్బంది సక్రమంగా మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ అన్నారు. కరీంనగర్ లో శనివారం రోజు నగర పర్యటన చేశారు. నగరపాలక సంస్థ హరితహారం విభాగం సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసి పరిశీలించారు. బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం హరితహారం కార్మీకులను పనులు చేసేందుకు కావల్సిన పనిముట్లు ఉన్నాయా లేదా అని స్వయంగా కార్మీకులను అడిగి తెలుసుకున్నారు.

నగరంలో హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ చర్యల పై కార్మీకులు అధికారులకు పలు సలహాలు సూచనలు చేస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా నగరపాలక సంస్థ ద్వారా పట్టణ ప్రకృతి వనాలు, చిట్టడవులు, యాదాద్రి, మియావాకి, డివైడర్లలో నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. సమయం ప్రకారం ప్రతి మొక్కలు నీరు అందించడంతో పాటు ఎలాంటి కలుపు మొక్కలు ఉన్న తొలగించాలని అన్నారు. నాటిన ప్రతి మొక్కను ఏపుగా పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పనిముట్ల కొరత ఉంటే ఇంజనీరింగ్ అధికారులకు తెలిపి.. కావల్సిన పనిముట్లను తెప్పించుకొవాలన్నారు. ఎక్కడ మొక్కలు ఎండిపోకుండ చూడటంతో పాటు ట్రీగాడ్స్ పడిపోయి ఉంటే వాటిని సరి చేయాలని ఆదేశించారు. మొక్కల మద్య ఎలాంటి కలుపు మొక్క లేకుండ శుభ్రపరిచి.. అవసరాన్ని బట్టి మొక్కలకు ఎరువులు అందించేలా చర్యలు తీస్రోవాలని ఆదేశించారు.