calender_icon.png 30 March, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరపాలక సంస్థ మురుగు నీటి శుద్దీకరణ కేంద్రాన్ని సందర్శించిన కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్

26-03-2025 07:03:50 PM

ఎస్టీపి ఆవరణలో నగరపాలక సంస్థ నూతనంగా నిర్మాణం చేస్తున్న మానవ వ్యర్థాల శుద్దీకరణ కర్మాగారం పనులను తనిఖీ చేసి పరిశీలన..

పనుల వేగవంతంపై అధికారులకు, ఏజెన్సీ కాంట్రాక్టర్ ఆదేశాలు...

కరీంనగర్ (విజయక్రాంతి): స్థిరమైన పారిశుధ్య పద్దతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా మానవ వ్యర్థాల శుద్దీకరణ కేంద్రాన్ని నిర్మాణం చేయడం జరుగుతుందని కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ అన్నారు. స్వచ్చ్ భారత్ మిషన్ లో భాగంగా ప్రభుత్వం కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా నూతనంగా మానవ వ్యర్థాల శుద్దీకరణ కేంద్రం నిర్మాణంకు గతంలోనే శ్రీకారం చుట్టింది. నగరపాలక సంస్థకు చెందిన మురుగు నీటి శుద్దీకరణ కేంద్రం ఆవరణలో నిర్మాణం చేస్తున్న మల స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్లతో కలిసి బుధవారం రోజు కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ సందర్శించారు. మానవ వ్యర్థాల శుద్దీకరణ నిర్మాణం పనులను తనిఖీ చేసి పరిశీలించారు.

ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి... పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మానవ వ్యర్థాల శుద్దీకరణ కేంద్రం పనులపై అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సలహాలు సూచనలు చేసి... పనుల వేగవంతంపై కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల వ్యవదిలో ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ, మాన్యూవల్ స్కావెంజిగ్ నిర్మూలణ, సామాజిక ఆర్థిక పురోగతి, జల వాతావరణ కాలుష్య నివారించడానికే మానవ వ్యర్థాల శుద్దీకరణ కేంద్రాలు సృష్టించ బడ్డాయని తెలిపారు. స్వచ్చ్ భారత్ మిషన్ లో భాగంగా ప్రభుత్వం నగరపాలక సంస్థ లో స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపి) నిర్మాణంకు చర్యలు తీస్కుందన్నారు.

నగరపాలక సంస్థ మురుగు నీటి శుద్దీకరణ కేంద్రం ఆవరణలోనే మానవ వ్యర్థాల శుద్దీకరణ కేంద్రంను నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. ఎకరం స్థలంలో స్లడ్జ్ కలెక్షన్ ట్యాంక్, స్లడ్జ్ ను ఎరువుగా మార్చేందుకు సోలార్ షెడ్లు, వే బ్రిడ్జ్ నిర్మాణం, గ్రీనరీ అభివృద్ధి, ఆపరేటింగ్ రూం, టాయిలెట్స్ నిర్మాణం చేసి ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని సెప్టిక్ ట్యాంకులు, పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ నుండి సెప్టిక్ క్లీనర్ ట్యాంకర్ల ద్వారా సేకరించిన మానవ వ్యర్థాలను ప్లాంట్ లో శుద్దీకరణ చేసి... ఎరువుగా మార్చేందుకు చర్యలు తీస్కోవడం జరుగుతుందని తెలిపారు. మానవ వ్యర్థాల శుద్దీకరణ కేంద్రం నిర్మాణంకు సంబంధించిన పనులను అధికారులతో కలిసి తనిఖీ చేసి పరిశీలించామని తెలిపారు.

ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పనులను 4 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలని... పనులను వేగవంతంగా పూర్తి చేయాలని  ఏజెన్సీ కాంట్రాక్టర్ అధికారులను ఆదేశించామని తెలిపారు. సెప్టిక్ ట్యాంకు క్లీనర్ల ద్వారా సేకరించిన మానవ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయడం ద్వారా వాతావరణ కాలుష్యంతో పాటు ఉపరితల భూగర్బ జలాలు కలిషితం కాకుండా మానవ వ్యర్థాలను శుద్దీ చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యర్థాలను ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ఎరువుగా మార్చే అవకాశం ఉందని అలాంటి ఎరువును మొక్కలకు వాడుకునే వీలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ లచ్చిరెడ్డి, ఎస్ టిపి ప్లాంట్ ఉద్యోగులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.