హైదరాబాద్ లో కురస్తున్న భారీ వర్షంపై జీహెచ్ఎంసీ ఇంజినీర్లతో కమిషనర్ రోనాల్డ్ రాస్ సమీక్ష నిర్వహించారు. నగరంలో వర్షాలు, ప్రజల ఇబ్బందులపై అధికారులతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షనమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఆలస్యంగా వెళ్లాలని కమిషనర్ సూచించారు. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని కమిషనర్ సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. అరగంటలో అత్యధికంగా 5 సెంటీ మీటర్ల వాన కురిసింది. యూసఫ్‌గూడ లో 5.1 సెంటీ మీటర్లు, ఖైరతాబాద్‌లో 4.8, ఆదర్శ నగర్ లో 4.4, శ్రీనగర్ కాలనీలో 4.2, బాలానగర్ ఫిరోజ్ గూడలో 4.2, బంజారాహిల్స్ 4.2, రాయదుర్గంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.