23-04-2025 06:33:37 PM
మంథని (విజయక్రాంతి): మంథనిలో కల్తీ ఆహార పదార్థాలపై కమిషనర్ మనోహర్(Commissioner Manohar) కన్నెర్ర చేశారు. బుధవారం పట్టణంలోని వివిధ హోటల్స్, కిరాణం షాప్స్, బేకరీ షాపులలో ప్లాస్టిక్, కల్తీ ఆహార పదార్థాలపై కమీషనర్ మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. షాపుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ (కవర్స్, గ్లాసులు) అమ్మకం చేస్తున్న దుకాణ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే జరిమానా విధించారు. ఎక్సపైరీ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలను ఆయన సీజ్ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... ప్రజల జీవితాలతో షాపుల యాజమాన్యులు ఆటలాడుకోవద్దని హెచ్చరించారు. నాణ్యమైన, కల్తీ లేని ఆహారాలను ప్రజలకు అందించాలని సూచించారు. షాపు యాజమాన్యులు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కల్తీ ఆహార పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనర్ మనోహర్ వెంట హెల్త్ అసిస్టెంట్ సునీల్, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.