calender_icon.png 11 February, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్ల కొట్లాట

10-02-2025 09:43:57 AM

కాంగ్రెస్ క్యాబినెట్లో యాదవులకు దక్కని మంత్రి పదవి 

సిద్దిపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య కమిషన్ల కొట్లాట జరుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలంలో పర్యటించిన ఇటీవల రకాల మరణం పొందిన పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం సిద్దిపేటలో యాదవ సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. బీసీ కులగనన పేరుతో బీసీల సంఖ్యను తగ్గించి చూపారని ఆరోపించారు. యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కులానికి ప్రోత్సాహం అందించి ఎదుగుదలకు కృషి చేశారని చెప్పారు.

గొర్రె పిల్లల పంపిణీ చేసి అనేకమందికి ఉపాధి కల్పించిన ఘనత బి.ఆర్.ఎస్ పార్టీకి దక్కిందన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర బడ్జెట్ లో గుండు సున్నా ఇచ్చిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో గెలిచిన ఏమి ప్రయోజనం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 11 సార్లు ఢిల్లీకి వెళ్లిన ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోవడం సిగ్గుచేటన్నారు. రెవెన్యూ శాఖలో 30% కమిషన్ల కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.