calender_icon.png 15 November, 2024 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా కూల్చివేతలపై కమిషన్ రంగనాథ్ వివరణ

08-09-2024 03:36:53 PM

హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై కమిషన్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో వచ్చే కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని రంగనాథ్ తెలిపారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణంలో ఉన్నాయని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సున్నం చెరువులో నిర్మించిన షెడ్లను వాణిజ్య పరంగా వినియోగిస్తున్నారని, వాణిజ్య పరంగా వినియోగించడంతో షెడ్లను కూల్చివేస్తున్నామన్నారు.

సున్నం చెరువులో ఉన్న నిర్మాణాలను గతంలో కూడా కూల్చేసినట్లు రంగనాథ్ గుర్తు చేశారు. అయినప్పటికీ అక్కడ మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు హైడ్రా కూల్చివేస్తుందని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బిల్డర్ విజయ లక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నామని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న ఇల్లు, భూమి కొనుగోలు చేయవద్దని రంగనాథ్ వివరించారు.