calender_icon.png 7 November, 2024 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోర్ వీలర్ లైసెన్స్‌తో వాణిజ్య వాహనాలు నడపొచ్చు

07-11-2024 01:24:46 AM

  1. మరో లైసెన్స్ అవసరం లేదు
    1. సుప్రీంకోర్టు ధర్మాసనం 

  2. న్యూఢిల్లీ, నవంబర్ 6: వాహన రంగానికి ఊతం ఇచ్చే విధంగా ఎల్‌ఎంవీ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. లైట్  మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్(ఎల్‌ఎంవీ) ఉన్న వారు కూడా గూడ్స్ వెహికిల్‌ను నడపొచ్చని, ఇందుకోసం మరో లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది.

  3. 7,500 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న కమర్షియల్  వెహికిల్స్‌ను ఎల్‌ఎంవీ లైసెన్స్‌తో బిజినెస్ చేసే వ్యక్తులు ఆటోలు, క్యాబ్‌లు నడుపుకోవచ్చని పేర్కొన్నది. అంతకంటే ఎక్కువ బరువున్న గూడ్స్ వెహికిల్‌ను తేలికపాటి వాహనం(ఎల్‌ఎంవీ) నుంచి ఎట్టి పరిస్థితుల్లోను మినహాయించవద్దని, ఒకవేళ అనుమతిస్తే ఎల్‌ఎంవీ లైసెన్స్ ఉన్న వ్యక్తి కూడా బస్, ట్రక్, రోడ్ రోలర్ కూడా నడుపుతారని పేర్కొన్నది.

  4. దీనివల్ల ప్రజల జీవితాలు ప్రమాదంలో పడతాయని 2017 ముకుంద్ దేవాంగ్ వర్సెస్ ఓరియెంట్‌ల బీమా కంపెనీ కేసులో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. దీనివల్ల నష్టపరిహారం చెల్లించే విషయంలో తమపై భారీగా బీమా భారం  పడుతుందని పేర్కొంటూ త్రిసభ్య ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బీమా కంపెనీలు 75 పిటిషన్లు వేశాయి. వీటిపై దర్యాప్తు చేసిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం..త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ పిటిషన్లను కొట్టివేసింది.

  5. ఎంవీ యాక్ట్ కింద పేర్కొన్న అదనపు శిక్షణ, అర్హత ప్రమాణాలు తక్కువ బరువును రవాణా చేసే వ్యక్తులకు వర్తిస్తాయని సూచించింది. 7,500 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న వాహనాలు దీని పరిధిలోకి రావని స్పష్టం చేసింది. చట్టానికి సవరణలు చేసి డ్రైవర్ల జీవనోపాధికి మార్గాన్ని చూపాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఈ సవరణలు అన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నాయని, సరైన సమయంలో వాటిని నోటిపై చేస్తామని ధర్మాసనానికి ఏజీ వెంకటరమణి తెలిపారు.