calender_icon.png 23 October, 2024 | 11:58 AM

వాణిజ్య వాహన విక్రయాలు తగ్గుతాయ్

15-07-2024 12:05:00 AM

కేర్‌ఎడ్జ్ రిపోర్ట్

న్యూఢిల్లీ, జూలై 14: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశంలో డిమాండ్ కొరవడినందున వాణిజ్య వాహన విక్రయాలు క్షీణిస్తాయని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది. మధ్యతరహా, భారీ వాణిజ్య వాహన విభాగాలు రెండింటి డిమాండ్ మందగిస్తున్నదని, డీలర్ల వద్ద భారీస్థాయిలో నిల్వలు ఉన్నాయని తెలిపింది.  దీంతో వాణిజ్య వాహన విక్రయాలు 2024 36 శాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నట్టు కేర్ ఎడ్జ్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ ఆర్తి రాయ్ పేర్కొన్నారు. బీఎస్ ప్రమాణాలతో వాహన ధరలు పెరగడం, ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో మందగమనం, ఎన్నికల నేపథ్యంలో డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోవడం ఈ పరిశ్రమ వృద్ధికి ఆటంకంగా ఉన్నట్టు  వివరించారు. వర్షాకాలం ముగిసిన తర్వాత ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు ఊపందుకునే అవకాశాలు ఉన్నందున ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వాణిజ్య వాహన విక్రయాలు మెరుగుపడవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రీప్లేస్‌మెంట్ డిమాండ్, పాత ప్రభుత్వ వాహనాల్ని తుక్కుగా మార్చడం వంటి అంశాలు పరిశ్రమకు మద్దతునిస్తాయన్నారు.