ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న తన స్థాయికి మించి కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా రని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మల్లన్న కావాలనే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మల్లన్నను సొంత డ బ్బు ఖర్చుపెట్టి గెలిపిస్తే, ఇప్పుడు ఆ పార్టీనే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మల్లన్నపై కాంగ్రెస్ అధి ష్ఠానం చర్యలు తీసుకునే తీరుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని మా జీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాస్తవానికి బీఆర్‌ఎస్ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ఐదారు నెలల ముందే రియల్ ఎస్టేట్ పడిపోయిందని వెల్లడించా రు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అక్రమణలకు గురైన చెరువులు, కుంటలను కాపాడేందుకే తమ ప్ర భుత్వం హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు.