సీఎంకు మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ప్రైవేటు టీచర్లను కించప రిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ డిమాండ్‌చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమ్మేళనంలో తన వ్యాఖ్యలతో సీఎం ప్రైవేట్ టీచర్ల మనస్సు గాయపరిచారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కూడా తన మనవలు, మనవరాళ్లను ప్రైవేటు స్కూళ్లకే పంపే పరిస్థితి ప్రస్తుతం ఉందని అన్నారు.