19-04-2025 12:00:00 AM
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతల ఫిర్యాదు
ముషీరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎం. అంజన్ కుమార్ యాదవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఎం. రమేష్ రామ్, ముషీరాబాద్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్, రాంనగర్ కార్పొరేటర్ రవి చారి, ఓబీసి జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు జి. వెంకటేష్, సలంద్రి శ్రీనివాస్ యాదవ్ లు మాట్లాడుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉపేక్షించలేదని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ బీ.రాజు నాయక్ కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొల్లంపల్లి రామ్‌రెడ్డి, బద్రి నారాయ ణ, పీఎన్ చారి తదితరులు పాల్గొన్నారు.