* కేరళ హైకోర్టు
త్రివేండ్రం, జనవరి 8: మహిళల శరీరాకృతిపై కామెంట్ చేసినా లైంగిక వేధింపులే అవుతాయని కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి తనను 2013 నుంచి శరీరాకృతిపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఓ మహిళ కొంతకాలం క్రితం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
ఈ కేసు కొట్టివేయాలని మాజీ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించాడు. పి టిషన్‌పై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. సదరు మహిళ అందంగా ఉందనే ఉద్దేశంతోనే తాను వ్యాఖ్యలు చేశానని మాజీ ఉద్యోగి తెలుపగా, కోర్టు స్పందించింది. శరీరాకృతి మహిళల ఆత్మగౌరవానికి సంబం ధించిందని, శరీరాకృతిపై వ్యాఖ్యలు వేధింపుల కిందకే వస్తాయంది.