calender_icon.png 23 September, 2024 | 5:53 AM

గోధ్వజ్ స్థాపన యాత్ర ప్రారంభం

23-09-2024 01:03:41 AM

అయోధ్య నుంచి ప్రారంభించిన శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి

  1. 36 రోజుల పాటు 36 నగరాల్లో కొనసాగనున్న గో పాదయాత్ర
  2. 22 నుంచి గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర
  3. గోపత్రిష్ఠ ఆందోళన్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల రాజధానుల పర్యటన
  4. జ్మోతిర్మఠ్ శంకరాచార్య స్వామిజీ అవిముక్తేశ్వరానంద్ సరస్వతి నిర్ణయం

అయోధ్య, సెప్టెంబర్ 22: గోమాతను రక్షించాలనే ఉద్దేశంతో జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి తలపెట్టిన గోధ్వజ్ స్థాపన యాత్ర ఆదివా రం ప్రారంభమైంది. రామ జన్మభూమి అయోధ్య నుంచి ఈ కార్యక్రమాన్ని స్వామీజీ ప్రారంభించారు. భారతీయుల మతపరమై న విశ్వాసాన్ని గౌరవించి ఆవును రాష్ట్ర జాబి తా నుంచి తొలగించి కేంద్ర జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో ఈ యాత్రను అవిముక్తేశ్వరానంద సరస్వతి మొదలుపెట్టారు.

సెప్టెంబర్ 22న అయోధ్య నుంచి ప్రారంభ మై అక్టోబర్ 26 వరకు మొత్తం 36 రాజధాని నగరాల్లో ఈ యాత్ర జరగనుంది. రాజ్యాంగం, చట్టాలలో గోమాతకు ప్రాధా న్యం కల్పించి దేశమంతా సంపూర్ణంగా గోమాతగా గౌరవించాలనే ఉద్దేశంతో గో ప్రతిష్ఠ ఆందోళన్‌ను నిర్వహిస్తున్నారు. గతం లో ప్రయాగ్‌రాజ్ వేదికగా శంకరాచార్యులు గోవును దేశమాతగా గౌరవించడంతో పాటు గోహత్యను నిర్మూలన సహా 21 ఆదేశాలను జారీ చేశారు.

ఈ గోప్రతిష్ఠ అభియా న్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకుక జోతిర్మఠ్ జగద్గురు శంకరాచార్య స్వామిజీ అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఈ ఆందోళనకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాదిని గోసంవత్సరంగా స్వామిజీ ప్రకటించారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల రాజధానుల్లో స్వామీజీ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి రాజధాని నగరంలో ఒక గో ధ్వజాన్ని స్థాపిస్తారు. ఈ యాత్ర గోమాత రాష్ట్రమాత. రాష్ట్రమాత  భారత్‌మాత అనే నేపథ్యంగా సాగనుంది.