calender_icon.png 27 October, 2024 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ జడ్జి క్వార్టర్స్ ప్రారంభం

27-10-2024 01:26:25 AM

బెల్లంపల్లి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): బెల్లంపల్లిలో నిర్మించిన సివిల్ జడ్జి క్వార్టర్స్‌ను శనివారం హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ప్రారంభించారు. న్యాయమూర్తికి ఆదివాసీ కళాకారులు గుస్సాడీ నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి జె.ముఖేష్, మంచిర్యాల డీసీపీ అగ్గడి భాస్కర్ పాల్గొన్నారు.

ప్రజలకు చేరువగా న్యాయసేవలు

ఖమ్మం, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ప్రజలకు న్యాయసే వలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తి, ఖమ్మం జిల్లా  పరిపాలనా  న్యాయ మూర్తి  పి.శ్రీసుధ,  హైకోర్టు న్యాయమూర్తులు  భీమపాక నగేశ్,  కాజా శరత్ అన్నారు. శనివారం వారు జిల్లా ప్రిన్సిపల్  డిస్ట్రిక్ట్, సెషన్స్  న్యాయమూర్తి  జి.రాజగోపాల్‌తో కలిసి మధిరలో రూ.24 కోట్ల అంచనా వ్యయంతో  నిర్మించనున్న రెండు కోర్టుల కాంప్లెక్స్‌లు, రూ.39 లక్షల అంచనా వ్యయంతో  నిర్మించనున్న రికార్డ్స్ భవన పను లకు భూమి పూజ చేసి మాట్లాడారు.

కాంట్రాక్టర్లు నిర్ణీత సమయంలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తర్వాత రిక్రియేషన్ క్లబ్ కాంప్లెక్స్‌లో  ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టును వారు ప్రారంభించారు. అనంతరం సిరిపురంలో అదనపు తరగతుల గదులను జస్టిస్ శరత్ ప్రారంభించారు.