12-02-2025 10:51:08 PM
చేవెళ్ల: చేవెళ్ల పట్టణ కేంద్రంలో రూ.6 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మోడ్రన్ బస్టాండ్ ను బుధవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హెచ్ ఎండీఏ నిధులు రూ.6 కోట్లతో నిర్మాణం చేపట్టిన ఈ బస్టాండ్ ను 18 నెలల్లోనే పూర్తి చేశామని తెలిపారు. 10 ప్లాట్ ఫాం లు ఏర్పాటు చేశామని, ప్రతిరోజు రోజు కొడంగల్, తాండూరు, వికారాబాద్, హైదరాబాద్, షాద్ నగర్, శంకర్ పల్లికి వెళ్లే 130 బస్సులు వస్తాయని తెలిపారు. బస్టాండ్ ఆవరణలో త్వరలోనే గ్రీనరీ ఏర్పాటు చేస్తామన్నారు. అంతే కాక పాత భవనాన్ని తొలగించి ఆ స్థలాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామన్నారు.
చేవెళ్ల ప్రాంతంలో కూరగాయలు, పండ్లు పండించే రైతులు ఎక్కువగా ఉన్నారని, అన్ని గ్రామాల ప్రజలకు బస్సు సౌకర్యం కలించాలని కోరారు. నూతన బస్సు డిపో ఏర్పాటు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కొద్ది సేపు బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ముడిమ్యాల పిఎస్ చైర్మన్ గోనె ప్రతాపరెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు రావులపల్లి శ్రీనివాస్, పామెన దవల్ గారి గోపాల్ రెడ్డి, పడాల ప్రభాకర్, పడాల రాములు డిసిసి ఉపాధ్యక్షులు పడాల రాములు, పీసీసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.