calender_icon.png 29 January, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోన్నారంలో సీసీ రోడ్డు ప్రారంభం

27-01-2025 06:46:46 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం గ్రామంలో సీసీ రోడ్డు పనులు గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఎమ్ఎన్ఆర్ ఈజిఎస్ నిధులు 5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కృషితో రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసు సంతోష్ కుమార్, పెంచాల రాజలింగు, బేర సమ్మయ్య, కుంటాల పోషం, యువ నాయకులు కోల భూషణం, గోసిక వినయ్ కుమార్, గ్రామస్థులు  పాల్గొన్నారు.