calender_icon.png 27 April, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కామ్రేడ్ బిటి రణదీవే 35వ వర్ధంతి

06-04-2025 10:00:48 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని స్థానిక విశ్రాంతి భవనం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక ఉద్యమ నాయకులు సిఐటియు అఖిల భారత వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదీవే 35వ వర్ధంతిని ఆదివారం సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ పాల్గొని కామ్రేడ్ బిటి రణదివే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా  సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ... కార్మిక ఉద్యమ నాయకులు, సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని 1970లో ఐక్యతా పోరాటమనే నినాదంతోనా సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఏర్పడిందన్నారు.

సిఐటియుకు మొట్టమొదటి అధ్యక్షులుగా 1970లో ఎన్నికయ్యారని అన్నారు. మొదట టెక్స్టైల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, తర్వాత రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించారన్నారు. 1928లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు అయ్యారని, 1979లో శ్రామిక మహిళల మహాసభలు నిర్వహించారని శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని, దేశంలో సగభాగంగా ఉన్న మహిళలు ఉద్యమాల్లోకి రావాలని, వారిని ప్రోత్సహించాలని అన్నారు. వారి ప్రత్యేక సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కులం - మతం వ్యక్తిగతంగా ఉండాలి. కానీ కులంతో పాటు కులతత్వం ఉండరాదు. కుల ఉన్మాదం ఉండరాదని ,మతం ఉండొచ్చు వ్యక్తిగతం మత ఉన్మాదం ఉండరాదని, కులం - మతం- లింగం స్త్రీ,పురుష తేడాలతో విడిపోతే కార్మికులు నష్టపోతారని యజమానులకు, పెట్టుబడిదారులకు ,పాలకులకు లాభాలు కార్మిక వర్గానికి నష్టాలు కష్ట కాలం వస్తుందని ఐక్యత చీలకుండా ఉద్యమం నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాగర్, రవి, రాజన్న, విలాస్, రాయలింగు, , కార్మికులు తదితరులు పాల్గొన్నారు.