11-03-2025 11:14:31 AM
సిరిసిల్లా డీఎస్పీ కలిసేందుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం
మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ పై పడిన కమాండెంట్
పైకి రాకముందు తెరుకున్న లిఫ్ట్, కిందపడిన కమాండెంట్
స్నేహితుడిని కలిసిన అనంతరం అనంతలోకాలకు
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla district)లో లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందాడు. పైకి రాకముందే లిఫ్ట్ డోర్(Lift Accident) తెరుచుకోవడంతో కమాండెంట్ కిందపడిపోయాడు. లిఫ్ట్ వచ్చిందనుకొని కమాండెంట్ లోపలికి అడుగువేశాడు. అంతే కమాండెంట్ మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ పై పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కమాండెంట్ గంగారం(Commandant Gangaram)(58) ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు.
కమాండెంట్ స్నేహితుడు సిరిసిల్లా డీఎస్పీ చంద్రశేఖర్(Rajanna Sircilla DSP Chandrashekhar)ను కలిసేందుకు వచ్చాడు. స్నేహితుడిని కలిసి తిరిగి వెళ్తుండగా లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ గంగారం అనంతలోకాలకు చేరకున్నాడు. కమాండెంట్ గంగారం 17వ పోలీసు బెటాలియన్ కు చెందినవారు. గంగారం స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండం సుద్దులం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం లిఫ్ట్ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. గంగారాంకు భార్య రేఖ, ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని సిరిసిల్లా జిల్లా ఎస్పీ మహేష్ బాబా సాహెల్ గీతే(Mahesh Babasaheb Geete) పరామర్శించి ధైర్యం చెప్పారు.