ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య
హైదరాబాద్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పా టు చేసినట్టు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రాక్టీకల్ పరీక్షలను పర్యవేక్షించనున్నట్టు వెల్లడించారు.
పరీక్షల నిర్వహణ కోసం 2,008 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. నాలుగు విడుత ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అనివార్య కారణాల వల్ల పరీక్షలకు హాజరు కాకుంటే, మూడు, నాలుగో విడుతలో అవకాశం కల్పిస్తామని కృష్ణ ఆదిత్య చెప్పారు.
నాలుగో విడుతల పరీక్షలు ఈ నెల 17 నుంచి 22 వరకు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి జయప్రదాబాయి, జాయింట్ సెక్రటరీలు మోహ న్, భీంసింగ్, వసుంధర్, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.