calender_icon.png 16 November, 2024 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనవైపే వస్తోంది..

11-09-2024 12:14:12 AM

  1. భూమికి సమీపంలో భారీ గ్రహశకలం
  2. ఏప్రిల్ 2029లో భూమిని ఢీకొట్టే అవకాశం
  3. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 10: ఓ భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకొస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) హెచ్చరించింది. అఫోసిస్ అనే ఆస్టరాయిడ్ 13  ఏప్రిల్, 2029లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని ఇస్రో వెల్లడించింది. ఈ గ్రహశకల గమనాన్ని ప్లానెటరీ డిఫెన్స్ అనే కొత్త విధానం ద్వారా ఇస్రో పర్యవేక్షిస్తోంది. అంతరిక్ష వస్తువుల నుంచి భూమిని రక్షించడం దీని పని. ఈ విషయమై ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ మాట్లాడుతూ.. ‘పెద్ద గ్రహశకలం దాడి మానవాళి అస్తిత్వానికి ముప్పు.

మా నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలసిస్ (నెట్రా) గ్రహశకలాన్ని చాలా దగ్గరగా పర్యవేక్షిస్తోంది. మానవ నివాసానికి భూమి మాత్రమే ఉంది. భవిష్యత్‌లో వచ్చే ముప్పుల నివారణకు అన్ని దేశాలతో కలిసి భారత్ ఎదుర్కొంటుంది’ అని సోమనాథ్ తెలిపారు. ఈ గ్రహశకలాన్ని మొదటిసారి 2004లో గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు.. భూమికి సమీపంగా వచ్చే అవకాశం ఉందని అంచనాకు వచ్చారు. అప్పటి నుంచి దీని గమనాన్ని ఇస్రో పర్యవేక్షిస్తోంది.