calender_icon.png 23 December, 2024 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగేళ్ల తర్వాత సోలోగా వస్తున్నా

22-12-2024 12:00:00 AM

రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గేమ్ చేంజర్’. , జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అంతకు ముందు టెక్సాస్‌లో రామ్‌చరణ్ ఫ్యాన్ మీట్‌లో మాట్లాడుతూ.. తనకు సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమేనని, అభిమానులను ఎప్పుడూ నిరాశపరచనన్నారు. “నాకు, దిల్ రాజుకు ఎన్నో విజయాలిచ్చిన సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమే. నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్ల పైనే అవుతోంది. మధ్యలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ను నా సోదరుడు ఎన్టీఆర్‌తో కలిసి చేశాను. ఇప్పుడు సోలోగా ‘గేమ్ చేంజర్’తో రాబోతున్నా. ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం. సినిమాలో దర్శకుడు శంకర్ స్టుల్‌ను మీరంతా మరోసారి చూసి ఎంజాయ్ చేస్తారు. అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచను” అని రామ్‌చరణ్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ కాగా.. శ్రీకాంత్, అంజలి, నవీన్‌చంద్ర, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.