calender_icon.png 28 January, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 14న వస్తున్నాం

21-11-2024 12:00:00 AM

సీనియర్ హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ ట్రైయాంగిల్ స్టొరీని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మాజీ భార్యగా కనిపించనుంది. ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు బుధ వారం అధికారికంగా ప్రకటించారు.

సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 14న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా హీరో వెంకటేశ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడే సంక్రాం తికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఇది నా కెరీర్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌” అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “గేమ్ ఛేంజ ర్’, ‘సంక్రాంతికి వస్తు న్నాం’లతో సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం.

‘డాకు మహారాజ్’ మేమే చేస్తు న్నాం. ఈ మూడూ సంక్రాంతికి పెద్ద విజయాలు సాధించబోతున్నాయి” అన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ఎక్స్ కాప్,  ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్, ఎక్సలెం ట్ వైఫ్ మధ్య జరిగే బ్యూటీఫుల్ జర్నీ. దీన్ని ఒక క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో చేశాం. కచ్చితంగా థ్రిల్ ఫీలవుతారు” అని చెప్పారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ.. ‘భాగ్యం లాంటి పాత్ర స్క్రీన్ మీద రాలేదు.

చాలా స్పెషల్ రోల్. ఈ సంక్రాంతి చాలా స్పెషల్‌గా ఉండబోతోంది’ అన్నారు. మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ‘కాప్ రోల్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ఈ సినిమాతో ఆ డ్రీమ్ నెరవేరింది’ అన్నారు.  కార్యక్రమంలో డాక్టర్ నరేశ్ వీకే, వీటీవీ గణేశ్, భీమ్స్ సిసిరోలి యో, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.