calender_icon.png 28 December, 2024 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మమ్మ ఇంటికి వచ్చి..అనంత లోకాలకు..

28-12-2024 03:02:39 AM

సిరిసిల్ల, డిసెంబర్ 27 (విజయక్రాం తి) : వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో సైకిల్ పై వెళ్తున్న బాలుడిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వాత్రిక్ (12) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన సాత్విక్... పాఠశాలకు సెలవులు కావడంతో శాత్రాజుపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు ఆడుకుం టున్న బాలుడిని రోడ్డుప్రమాదంలో మృ త్యువు కబలించింది. కాగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పారిపోతుండగా గ్రామస్తులు వెంబడించి వట్టెంల గ్రామంలో పట్టుకున్నారు. బాలుని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.