calender_icon.png 1 March, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు ప్రేక్షకుల ముందుకు మళ్లీ వస్తున్నా..

28-02-2025 12:00:00 AM

తమిళ మూవీ ‘డ్రాగన్’ తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ పేరుతో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఇద్దరు ముద్దుగుమ్మలో అనుపమకు పెద్దగా పేరు రాలేదు కానీ కయాదు పేరు మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.

సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మను తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ ముద్దుగుమ్మ మూడేళ్ల క్రితమే తెలుగులో ‘అల్లూరి’ సినిమాలో నటించింది. అప్పుడెందుకో కానీ అమ్మడికి గుర్తింపే రాలేదు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇక కయాదు ‘డ్రాగన్’ విడుదలకు ముందే విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ఫంకీ’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.

ప్రస్తుతం అమ్మడు తెలుగు కూడా నేర్చుకుంటోంది. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ తన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది. ఈక్రమంలోనే తెలుగుతో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలిపింది. ‘ఫంకీ’ సినిమా కూడా హిట్ అయితే ఈ ముద్దుగుమ్మను పట్టుకోవడం కష్టమే.