calender_icon.png 26 October, 2024 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కామెడీ క్వీన్.. ఇక హీరోయిన్

05-07-2024 12:05:00 AM

నిహారిక ఎన్‌ఎం.. తెలుగు తెరకు మరింత నిగారింపు తీసుకురానున్న సరికొత్త అందం. యూట్యూబర్‌గా తనదైన కామెడీతో నవ్వు లు పండించిన ఈ చిన్నది సోషల్ మీడి యా ఇన్‌ఫ్లూయెన్సరే కాదు మంచి డ్యాన్సర్ కూడా. ‘టైప్స్’ పేరుతో ఈ అమ్మడు చేసిన వీడియో సిరీస్ యూట్యూబ్‌లో ఆదరణ పొందిం ది. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. త్వరలో ఓ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నది చెన్నైకి చెందిన ఈ కుందనపు బొమ్మ. ఈ సందర్భంగా ఆమె గురించిన కొన్ని సంగతులు... 

నిహారిక ఎన్‌ఎం 1997, జూలై 4న తమిళనాడు రాష్ట్ర రాజధానిలో జన్మించిన ఈ చెన్నై చందనపు బొమ్మ బెంగళూరులో పెరిగింది. తల్లిదం డ్రులతో కలిసి ప్రస్తుతం ముంబయిలో నివసిస్తోంది. ఎప్పుడూ థియేటర్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉండటంతో పెరిగే కొద్దీ సినిమాలు, నాటకాల పట్ల ఆకర్షితురాలయ్యింది. పదో తరగతి చదువుతున్న రోజు ల్లోనే యూట్యూబర్‌గా జర్నీ ప్రారంభించింది. చదువు పరంగా ఆమె కాలిఫోర్నియాలోని చాప్ మాస్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది.

డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గానే కాక నటనా రంగంలోనూ ప్రవేశించింది. ఓటీటీ వేదికగా పలు సిరీస్‌లలో అతిథి పాత్రలు, చిన్న చిన్న క్యారెక్టర్లలో కనిపించి, ప్రతిభ ప్రదర్శించ టం ద్వారా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. నూతన దర్శకుడు ఆకాశ్ భాస్కరన్ డైరెక్షన్‌లో విడుదలకు సిద్ధం గా ఉన్న ఓ తమిళ చిత్రంలో నటించింది. 

టాలీవుడ్‌లో ఎంట్రీకి... 

సోషల్ మీడియాలో ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న నిహారిక ఎన్‌ఎం అక్కడ 6 మిలియన్ల సబ్‌స్ర్కైబర్స్‌ను కలిగి ఉంది. ఇటీవల యూట్యూబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రియేటర్స్ ఫర్ ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భారతదేశం నుంచి వరుసగా రెండో సారి పాల్గొంది. కొన్ని ముఖ్య మైన సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కంటెంట్ క్రియేట్ చేస్తోంది నిహారిక. తను చదువు కున్న కాలిఫోర్నియా యూనివర్సిటీ నిహారిక ఎన్‌ఎం కెరీర్‌లో ఎదిగిన తీరుపై కేస్ స్టడీ చేస్తుండటం విశేషం. అలాంటి యువ నటి గురించి టాలీవుడ్‌కు చెందిన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఓ శుభవార్త చెప్పింది. 

ఆ సంస్థ నిర్మించనున్న ఓ సినిమా ద్వారా కథానాయికగా తెలుగు ప్రేక్షక్షకులకు పరిచ యం కానుందని వెల్లడించింది. బుధవారం నిహారిక పుట్టిన రోజును పురస్కరించుకొని ఆమె కు టాలీవుడ్‌లోకి స్వాగతం పలుకుతూ గీతా ఆర్ట్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.