calender_icon.png 11 January, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులతో రండి.. అద్భుతాలు సృష్టిద్దాం

11-01-2025 12:46:08 AM

ఉత్తమ వ్యాపార సౌలభ్యాలు కల్పిస్తాం

  1. హైదరాబాద్‌ను ఫోర్త్‌సిటీగా మలుస్తాం
  2. ‘రైజింగ్ తెలంగాణ’ కలను సాకారం చేస్తాం
  3. సీఐఐ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): ‘సేవా రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ నగరాల తో పోటీపడేలా హైదరాబాద్‌ను ఫోర్త్ సిటీగా మలచబోతున్నాం. ఈజీ ఆఫ్ బిజినెస్ డూయింగ్ విధానాన్ని అనుసరిస్తాం. ఉత్తమ వ్యాపార సౌలభ్యాలు కల్పిస్తాం.

భారీ పెట్టుబడులతో రండి.. తద్వారా అద్భుతాలు సృష్టిద్దాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో శుక్రవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన జాతీయ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా సీఎం మా ట్లాడుతూ.. రానున్న 50 ఏళ్ల కోసం పక్కాగా ప్రణాళికలు రచిస్తున్నామని, రైజింగ్ తెలంగాణ కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నామని ఉద్ఘాటించారు. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో నగరమవుతుందని, దీనిలో భాగంగానే ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ పరిధిలో 3,200 ఈవీ బస్సులు అందుబాటులోకి తెచ్చిందని స్పష్టం చేశారు.

దేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని, ఈవీలను ప్రోత్సహించే లక్ష్యంతోనే ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను మినహాయించామని వెల్లడించారు. 

వరదలు లేని నగరంగా తీర్చిదిద్దుతాం..

రాజధానిని వరదలు లేని నగరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా, ఎలాంటి ప్రకృతి వైపరీ త్యాన్నైనా ఎదుర్కొనేలా యాక్షన్ ప్లాన్ అమ లు చేస్తున్నామని తెలిపారు. మూసీ పునరుజ్జీవంతో జలాలు స్వచ్ఛందంగా మారతా యన్నారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రణాళిక దశలో ఉందని, 360 కిలోమీటర్ల మేర ఆర్‌ఆర్‌ఆర్ ఉంటుందన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ అందుబాటులోకి వస్తే, తెలంగాణ 70శాతం అర్బన్ ప్రాంతంగా మారుతుందన్నారు. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ప్రాంతం తయారీ, మార్కెట్ రంగాల హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడికి ఫార్మా, లైఫ్ సెన్సైస్, ఏరోస్పేస్, డిఫెన్స్, సోలార్ వంటి భారీ పరిశ్ర మలు వస్తాయన్నారు.

చైనాలో ప్రతి రంగానికి ఒక సిటీ కేరాఫ్‌గా ఉంటుందని, అలాం టి ప్రణాళికలనే రాష్ట్రం లో అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. డ్రై పోర్ట్  ఏర్పా టు పైనా అధ్యయనం చేస్తున్నామని స్పష్టం చేశారు.

డ్రైపోర్ట్ ద్వారా ఏపీలోని బందర్ ఓడరేవుతో అనుసంధానం చేసే దిశగా ఆలోచిస్తున్నామని తెలిపారు. స్వయం సంఘాల పరిధిలో 67 లక్షల మం ది మహిళలు సభ్యులుగా ఉన్నారని, వారి ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.

మహిళల ఆర్థిక అభ్యున్నతే ధ్యేయం..

ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్ల నిర్వహణే సంఘాల సభ్యులకే అప్పగించా మ న్నారు. త్వరలో కొన్ని సోలార్ పవర్ స్టేషన్లను వారికే అప్పగిస్తామన్నారు. ఏటా కాలే జీల నుంచి సుమారు 10 లక్షల మంది ఇం జనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారని, కానీ.. వారిలో ఎక్కువమందికి నైపు ణ్యాలు ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అందుకే ప్రభుత్వం ఐఎస్‌బీ తరహా లో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. స్కిల్ వర్సిటీకి కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీం ద్రా అధ్యక్షతన బోర్డు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుకూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

టాటా గ్రూప్ సహకా రంతో రూ.2,400 కోట్లతో ఐటీఐలను అ డ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయబోతున్నామని స్పష్టం చేశారు. సీఐఐ ప్రతినిధులు తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని, వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పూరీ, వైఎస్ ప్రెసిడెంట్ ఆర్.ముకుందన్, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పాల్గొన్నారు.