27-04-2025 12:00:00 AM
ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్ పర్సన్ ఎం.భాగ్యలక్ష్మి పిలుపు
ముషీరాబాద్, ఏప్రిల్ 26 (విజయ క్రాంతి) : మే 30న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన మహిళా సింహా గర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు భారీ ఎత్తున తరలి రావాలని ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్ పర్సన్ ఎం.భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ మహిళా సమాఖ్య అనుబంధ సంఘాలు, ఇబీసీ మహిళా సమాఖ్య దళిత్, ట్రైబల్ మైనార్టీ మహిళ కామిటీ ఛైర్ పర్సన్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన తలపెట్టిన మహిళా సింహా గర్జన కోసం సభ్యత్వ ప్రారంభం సభ్యత్వ నమోదు పుస్తకాలను గ్రేటర్ హైద్రాబాద్ ప్రతినిధులతో కలసి విడుదల చేశారు.
అనంతరం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి నియోకవర్గం నుండి 5 వేల మంది మహిళలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహి స్తున్నామని తెలిపారు. మహిళా బిల్లులో బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ, ఇబీసీ మహిళలకే అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు కేటాయించాలని అన్నారు. ఈ సభకు ముఖ్య అతిధిగా ఓబీసీ పార్లమెంటు కమిటీ చర్పర్సన్, ఎంపీ గణేష్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. పలు బీసీ సంఘాల ప్రతినిధులు అల్వల సువర్ణ, బొగ్గరపు ఉమ, పాల్వాయి శ్రీనిధి, దుర్గం పద్మగౌడ్, సునీత తదితరులు పాల్గొన్నారు.