22-03-2025 11:31:31 PM
మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించిన అధికారులు వేద పండితులు..
హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): భద్రాచలంలో ఏప్రిల్ 6న జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనాల్సిందిగా ఆలయ వేదపండితులు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆహ్వానించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ అధికారి రమాదేవి లతో వారు శనివారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును కలిశారు. స్వామివార్ల కళ్యాణ పత్రికను అందజేశారు. 7వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగగా జరుగుతుందని, ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని వేదపండితులు కోరారు.