19-03-2025 01:45:20 AM
విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసుల ఫోన్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18 (విజయక్రాంతి): బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన 11 మంది సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఒకరైన విష్ణుప్రియను మంగళవారం విచారణకు హాజరుకావాలని పంజాగుట్ట పోలీ సులు ఫోన్ చేశారు. కానీ ఆమె హాజరు కాలేదు. విష్ణుప్రియ, టేస్టీ తేజల తరఫున బిగ్‌బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్‌భాష మంగళవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. విచారణకు హాజరు కావడానికి వారి కి సమయం ఇవ్వాలని కోరారు.
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్‌పై కేసు
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కి రణ్‌గౌడ్ అనే కానిస్టేబుల్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైం ది. కిరణ్‌గౌడ్ ప్రస్తుతం హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా టెలిగ్రామ్ చానెల్ లో బెట్టింగ్ టిప్స్ ఇస్తున్నట్లు అతడిపై ఆరోపణలున్నాయి. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.