calender_icon.png 7 February, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుమతుల ప్రదానోత్సవానికి రండి

07-02-2025 12:00:00 AM

రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కు ఆహ్వానం  

రాజేంద్రనగర్, (కార్వాన్) ఫిబ్రవరి 6 : కుస్తీ పోటీల్లో చివరి రోజున బహుమతుల ప్రదానోత్సవానికి రావాలని కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డికి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని జియాగూడ డివిజన్లో మున్సిపల్ గ్రౌండ్లో గురువారం నాల్గవ వీర్ చంద్రశేఖర్ ఆజాద్ కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ నాయకులు కూరాకుల కృష్ణ, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముంగి జైపాల్ రెడ్డి జియాగూడ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కార్వాన్ డివిజన్ ప్రెసిడెంట్ రామ్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ అబ్దుల్ హమీద్, ధరం సింగ్, నర్సింగ్ కూరాకుల రఘువీర్, సాయికుమార్ తదితరులు శివసేన రెడ్డికి వినతిపత్రం అందించిన వారిలో ఉన్నారు. తమ ఆహ్వానాన్ని ఆయన మన్నించినట్లు తెలిపారు.