calender_icon.png 23 February, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘లక్ష డప్పులు.. వేల గొంతులు’ కార్యక్రమానికి రండి

30-01-2025 12:00:00 AM

వికారాబాద్, జనవరి- 29 :లక్షల డప్పులు- వేల గొంతులు కార్యక్రమానికి హాజరు కావాలని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత డాక్టర్ ఏ. చంద్రశేఖర్ ను  మందకృష్ణ మాదిగ ఆహ్వా నించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ నగరంలో నిర్వహించబోయే లక్ష డప్పులు..

వేల గొంతులు కార్యక్రమానికి రావాల్సిందిగా బుధవారం నాడు మందకృష్ణ మాదిగ  కాంగ్రెస్ నేత మాజీ మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్  నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్  మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా వారికి శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతి ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.